పదో తరగతి చదువుతున్న ఇద్దరు బెంగళూరుకు చెందిన విద్యార్థులు ఈ లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.దీప్ దేశాయ్,నందన్ కోనేటి,బెంగుళూరులోని విద్యా శిల్పా అకాడమీ లో చదువుతున్నారు .కరోనా వల్ల పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చాలని సంకల్పించారు తల్లిదండ్రుల సాయంతో కిచిడీ ప్రాజెక్ట్ పేరిట పేదలకు కిచిడీ ,చట్నీ పంచడం మొదలు పెట్టారు .ఈ కార్యక్రమం గురించి ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం తో స్నేహితులు పరిచయస్తులు తలా కొంత డబ్బు సాయం చేశారు .ఒక లక్షా యాభై వేల రూపాయలు పోగయ్యాయి. ఈ మొత్తం తో బెంగళూరులో రోజుకు వంద మందికి కిచిడీ అందిస్తున్నారీ  విద్యార్థులు .

Leave a comment