చేతిలో ఫోనుంటే టైమ్ కోసం వాటీ చూసుకొనే అవసరం లేదు కానీ కొన్ని సందర్భాలకు వాచీలే స్టైల్ అంటున్నారు అమ్మాయిలు .కొత్త డిజైన్ లు , ఫంకీ లుక్ తో అమ్మాయిలు స్టైల్ గా కనబడేలా చేస్తాయి. చంకీ వాచీలు డయిల్ బెల్టుతో పాటు గొలుసులు, చిన్న చిన్న బొమ్మలు పూసలు దీనిలో వేలాడుతూ ఉంటాయి. అలాగే రోల్డ్ గోల్డ్ వాచీలు కూడా హాటెస్ట్ ట్రెండ్. ప్రింటెడ్ వాచీలు పూలు ,జంతువుల బొమ్మలతో చక్కగా ఉన్నాయి. సింపుల్ గా ఏదైనా పార్టీకి వెళితే సాదా దుస్తువులపైకి కూడా ఈ వాచీలు బావుంటాయి. వస్త్రంతో చేసిన వాచీలు ఇప్పుడు కాలేజీ అమ్మాయిలకు ఇష్టమైన ట్రెండీ ఫ్యాషన్. ఇక స్మార్ట్ వాచీలు అన్నీ విధాలా ఉపయోగం ,అందం స్టైల్ కూడా.

Leave a comment