పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే  అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్  ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి  ఉన్నట్లు  గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్  లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు లేబొరేటరీ పరీక్షలు పేర్కొన్నాయి. పసుపు లోని కర్కుమిన్ బయటకు తెచ్చి తయారు చేసిన కాప్సూల్స్ ను బ్రేక్ ఫాస్ట్ తర్వాత డిన్నర్ తర్వాత  వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. పసుపు సురక్షిత పదార్థంగా పెద్దలు భావిస్తున్నప్పటికీ ఈ కాప్స్యూల్స్ వల్ల  అజీర్ణం వికారం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు . పసుపు వల్ల  మాత్రం రుతు స్రావ క్రమ బద్ధీకరణ జీర్ణ సహాయకారిగా లివర్ పనితీరు మెరుగుపరిచే ఔషధంగా ఎగ్జిమా కి చికిత్సగా ఎన్నో లాభాలున్నాయి. రోజువారీ గా ఆహార పదార్ధాల్లో పసుపు విరివిగా వాడితే టాక్సిన్లు శరీరం నుంచి వెళ్లి పోతాయి.  నోటి ఆరోగ్యం బావుంటుంది.

Leave a comment