ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పెనుగొండ లో ఉన్న నాగులమడక స్వామిని దర్శించి ఆయురారోగ్యాలతో ఆశీస్సులు పొందుదామా!!రండి వనితలూ!!
ఒక బ్రాహ్మణుడుకి కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించి తన ఆచూకి వివరించి అదృశ్యం అయ్యాడు.వెంటనే తన నాగలితో వెళ్ళి నేల తవ్వుతుండగా నాగలి అంచుకు తగిలి ఏడు పడగలతో,మూడు చుట్లతో వున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు.ఇక్కడ రజతోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది.ప్రసాద వితరణకు పెట్టిన అన్నపురాశి చుట్టూ ఒక సర్పం వచ్చి ప్రదక్షిణం చేసింది అని ప్రత్యక్ష సాక్షం.సంతానం లేని వారికి, నాగ దోషాలు, వివాహం జరుగకపోవుట మొదలగువారు ఇచ్చటికి వచ్చిన సత్ఫలితాలిస్తుంది.
నిత్య ప్రసాదం: కొబ్బరి, ఆవుపాలతో అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment