కిర్రాక్ పార్టీతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది సంయుక్తా హెగ్డె. కన్నడంలో సక్సెస్ అయింది కనుక తెలుగులోనూ మంచి విజయాన్ని అందిస్తుందని అనుకున్నాను. నేటీవిటికి అనుగుణంగా కాస్తా మార్చారు. కాని ఒరిజినల్ సినిమాను పెద్దగా మార్పులు చెయ్యలేదు. కన్నడ సినిమాల్లో కాస్తా బిజీగా ఉన్నాను కాని ఇందులో పాత్ర నప్పుతుందని గాఢంగా అనిపించి ఒప్పేసుకున్నా అంటుంది సంయుక్తా హెగ్డె. భాషా సమస్య ఉంది కాని అది పెద్ద ఇబ్బంది పెట్టలేదు. డాన్స్ బాగా వచ్చు కనుక అది సమస్య కాదు. కాస్తా తేలిగ్గానే నా రోల్ నడిపించగలిగాను ఫ్యూచర్ లో మరీ బరువైన పాత్రలో లేడీ ఒరియంటేడ్ సినిమాలు ఊహించాను కాని నా వయసుకు తగ్గ పాత్రలు వేయలని ఉంది అంటుంది సంయుక్త హెగ్డె.

Leave a comment