Categories
Gagana

సక్సెస్ పరుగులో నివేదా ధామస్.

కేరళ అమ్మాయిలు చాలా ముందే తెలుగు తెరను తమ అనడంతో అభినయం తో సొంతం చేసుకుంటున్నారు. అటు మలయాళం నుంచి కూడా దక్షిణాదికి తరలి వచ్చిన అందమైన అమ్మాయిలు బిజీ అయ్యిపోతున్నారు. జెంటిల్మెన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు తరలి వచ్చిన నివేదా ధామస్ మలయాళంలో చిల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత ప్రణయం సినిమా తో హీరోయిన్ గా తమిళ రంగం లో నుంచి తెలుగు తెర పైకి వచ్చింది. ‘నిన్ను కోరి’ ఈ సంవత్సరం నివేదాకు సక్సెస్ ను తెచ్చిపెట్టింది. వరుసగా ఆమెకోసం సినిమాలు క్యూలు కట్టాయి. ఎన్టీఆర్ తో జై లవకుశలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం దృశ్యం రీమేక్  పాపనాశనం లో కమల్ హాసన్ కూతురిగా నటించిన నివేద ఇప్పుడు మూడు భాషా చిత్రాల్లో నటిస్తుంది.

Leave a comment