ఏదైనా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు అంటుంది పూర్వ జిందాల్. టెక్స్‌టైల్స్ బిజినెస్ ఎన్.కె జిందాల్ ప్రోత్సహం తో ముంబై లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన పూర్వ సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని లీజ్ కు తీసుకొని బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాట, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండిస్తోంది.‘సాఖి ఆర్గానిక్’ పేరుతో వాట్సాప్ ఆర్డర్‌లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది.గ్రామాల్లో ‘ఆగ్రో టూరిజం’పైన అవగాహన కల్పిస్తోంది.రోజు సంపాదన ఆరేడు వేల రూపాయలే ఎంతో స్ఫూర్తి ఇస్తున్నాయని తన దగ్గర పనిచేసే ఏడుగురు కూలీలకే ఉపాధి ఇవ్వగలుగుతున్నానని చెపుతోంది. టెక్స్‌టైల్స్ టైమాన్ జిందాల్ కూతురు పూర్వ జిందాల్.
Categories