కడిమి చెట్లు ఉన్న చోట పార్వతి దేవి కొలువై ఉంటుందంటారు. నియోలా మార్కియా అనే శాస్త్రీయనామం గల కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లుగా ఉంటాయి కదంబ పూలు. గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి. ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్యపరంగాను కడిమి చెట్టు ప్రత్యేకమే. ఈ చెట్టు కలపతో బొమ్మలు తేలికపాటి పెట్టెలు ప్యాకేజింగ్ వస్తువుల తయారీ కలప గుజ్జులు కాగితం తయారీకి ఉపయోగిస్తారు. ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.

Leave a comment