వక్కలు కాసే చెట్లని పోకచెట్లు అంటారు . తీరప్రాంతాలైన కర్నాటక ,కేరళ ప్రాంతాల్లో ఇవి సాగవుతున్నాయి . వక్కలను అదృష్టానికి ప్రతీకలుగా చెపుతారు శుభకార్యాలలో ,పూజలలో ఆకు ,వక్క పంచటం ఆనవాయితీగా ఉంది . ఇవి రుచిగా ఘాటుగా ఉంటాయి . వీటిలో అల్కటాయిన్లు ,టానిక్ శాతం ఎక్కువ . తరుచు ఆకువక్క ,కిల్లీలు తింటే అనారోగ్యమే అంటున్నారు . అయితే ఈ వక్కల్లో ఉండే ఔషధ గుణాలు వల్ల ఆయుర్వేద మందుల్లో వాడతారు . దీనిలోని ఎరికోలిన్ అనే పదార్థం మెదడును ప్రభావితం చేస్తుంది . ఆల్కహాల్ ,కెఫిల్ ల తర్వాత మానసిక ప్రేరిత పదార్థంగా దీన్ని చెపుతారు ప్రోటీన్లు కార్బోహైట్రేట్స్ ,పొటాషియం ,కాల్షియం ,ఐరన్ పుష్కలంగా ఉన్నా వక్కల్లో వెట్యులర్ డిజనరేషన్ ను అడ్డుకొనే శక్తి ఉంది .

Leave a comment