దేశంలోనే తోలి మృదంగ విద్వాంసురాలిగా పేరు ప్రఖ్యాతలు గణించిన మృదంగ మహారాణి దండమూడి సుమతి రామ్మోహన్ రావ్ కు పద్మ పురస్కారం లభించింది. కేవలం పురుషులకే పరిమితమైన మృదంగం పై ఒక అమ్మాయి చేతుల లయ బద్దంగా విన్యాసాలు చేసి దేశ విదేశాల్లో ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. దండమూడి సుమతి రామ్మోహన్ 10 వ సంవత్సరం లోనే తోలి ప్రదర్శన ఇచ్చారు. మృదంగం లో డిప్లొమా కోర్స్ చేశారు. దండమూడి రామ్మోహన్ రావు దగ్గర శిష్యురాలిగా చేరి ఆయన్నే వివాహం చేసుకొన్నారు. విజయవాడ లోని ఘంటశాల సంగీతం కళాశాలలో విద్యార్ధినిగా ఉన్న ఆమె అదే కళాశాలలో అధ్యాపకురాలిగా ప్రిన్స్ పల్ గా పనిచేశారు. 2003 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకొన్నారు.

Leave a comment