తక్షణ శక్తి నిచ్చే పదార్ధాల్లో కిస్మిస్ ను మొదటిగా చెప్పుకోవచ్చు తీపినిచ్చే ఎండు ద్రాక్ష లో కాల్షియం,ఐరన్ మాంగనీస్,మెగ్నీషియం,జింక్,ఫ్లోరైడ్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది నల్ల ఎండు ద్రాక్షలో అయితే మరీ ఎక్కువ. ఆహారం సరిగా తీసుకొని పిల్లల కు,పిస్తా బాదం,జీడిపప్పు ద్రాక్ష తో కలిపి లడ్డులు చుట్టి ఇస్తే మంచిది. రక్తపోటు సమస్యకు ఎండు ద్రాక్ష చాలా మేలు చేస్తుంది. వాటిని రాత్రి వేళ నీళ్ళలో నానపెట్టి ఉదయం తీసుకొంటే చాలా మంచిది. ఈ వేసవి కి తక్షణ శక్తిని ఇచ్చే ద్రాక్ష పండ్లు రోజుకు పది పండ్ల అయినా తింటే మేలు.

Leave a comment