బైక్ పైన ప్రతి రోజు ప్రయాణం చేయటం వల్ల చర్మం,కేశాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇకపైన ఎండలు ముదిరిపోతాయి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బయటికి వెళ్ళే ముందర సన్ స్క్రీన్ లోషన్ రాసుకోని తీరాలి. చర్మం పాడవకుండా క్లెన్సర్ లు వాడాలి. హైడ్రేటింగ్ మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. నీళ్ళుతాగాలి . బ్యాగ్ లో వైట్ వైపర్స్ ఉంచుకొని వాటితో ముఖం పైన పేరుకున్న దుమ్ము తుడుచుకోవాలి. మేకప్ కిట్ లో లిప్ బామ్ తప్పని సరిగా ఉంచుకోవాలి. వెంట్రుకలు లూజ్ గా వదిలేయకుండా జడవేసుకొని ముడిలాగా పెట్టుకోవాలి. సూర్యరశ్మికి వెంట్రుకలు దెబ్బతిన కుండా హైడ్రేటింగ్ సీరమ్ రాసుకోవాలి. షాంపూతో తలస్నానం చేశాక కండిషనర్ అప్లయ్ చేసుకోవాలి.

Leave a comment