ఎండ తగిలితే శరీరం కమిలి పోతుందని వేసవి ఎండ లోకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ ప్రతి రోజు కనీసం పావుగంట ఉదయపు నీరెండలో గడపమని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎండవలన చర్మం పై పొరల్లో ని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గ మారి రక్తనాళాలు వెడల్పు చేస్తుందని దీని వల్ల రక్తపోటు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. నిద్రలేమితో బాధపడే వారు ఎండలో నిలబడితే నిద్రకు కావలసిన మెలోటోనిన్,అవసరమైన విటమిన్-డి సమకూరుతుంది. చాలామంది భావించినట్లు ఉదయపు ఎండ లోని సూర్య కిరణాలు చర్మానికి ఎటువంటి హాని చేయవు. పైగా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను తగ్గిస్తాయి కూడా.

Leave a comment