అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్ వాడిన ఘనత మెసపొటేనియన్ మహిళలదే ఇక 16 వ శతాబ్దంలో మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టిలోని మైనం నుంచి సేకరించిన ఎర్రని ద్రవం తో తయారైన లిప్స్ టిక్ వాడేవారు. ఏనాటి కధలో ఇలా ఉంచేసి ఇప్పటి లిప్స్ టిక్ లు ఎంచుకోవడం లో మాత్రం కాస్త శ్రద్ధ చూపించాలి. లిప్స్ టిక్ని అరచేతిపై రాసి సరైన కలర్ ని ఎంపిక చేసుకోవాలి. అరచేయి తెల్లగా వుంటుంది కనుక లిప్స్ టిక్ చాయ తలిసిపోతుంది. శరీరపు రంగుని బట్టి ఎంపిక వుండాలి. మరీ తెల్లగా వుంటే ఎర్రని రంగు బావుండదు బదులుగా ఎరుపులోనే లేత రంగులు బావుంటాయి. కొంచం రంగు తకువైతే ముదురు రంగుల్లో, ఎరుపు, రాణి రంగు దేన్నెయినా ప్రయత్నించ వచ్చు. రంగు బాగా తక్కువగా వుంటే శరీరపు చాయ నలుపుకు దగ్గరగా వుంటే ఉదా రంగు,ముదురు గోధుమ రంగులు బావుంటాయి. మరీ కొట్టొచ్చినట్టుగా , మరీ కనిపించ పోయినా రెండూ బావుండవు.
Categories
Soyagam

సుందర హాసానికి తోడయ్యే రంగులు

Leave a comment