వారంమొత్తం ఎదురు చూసే ఆదివారం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది . ఎప్పటికప్పుడు మాములు రోజుల కంటే పనుల వత్తిడిలో టెన్షన్ గా గడిపే కన్నా కాస్త ప్లాన్ చేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కాస్త లేటుగా లేవచ్చు పర్లేదు ఓ గంట దుస్తుల కోసం కేటాయించొచ్చు . వారం మొత్తం వేసుకొన్న దుస్తులు సర్దిపెట్టుకోవచ్చు . అలాగే ఆహారం బ్రేక్ పాస్ట్ గా ఏమేం చేయదలచుకొంటే అవన్నీ లిస్ట్ రాసుకొని తెచ్చిపెట్టుకొనేందుకు ఇంకోగంట . ఇల్లు సర్దుకొనేందుకు ఓ అరగంట చాలు మిగతా సమయం డిజిటల్ డీటాక్స్ పాటిస్తే చాలు అంటే సెల్ ఫోన్ లు కంప్యూటర్లు ముట్టుకోకుండా ,హాయిగా స్నేహితులతో కబుర్లు ,ఏదైనా పుస్తకం ,మంచి టిపిన్ తీరిగ్గా నిద్ర ఇలా ప్లాన్ చేసేసుకుంటే రెండు వారలు తిరిగే కల్లా ఆదివారం మన గుప్పిట్లో ఇమిడి పోతుంది అంటున్నారు .

Leave a comment