సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ,సొసైటీ ఫర్  ఎన్విరాన్ మెంట్ కమ్యూనికేషన్ సంస్థలను నడిపిస్తున్నారు . పర్యావరణ వేత్త సునీత నారాయణన్ . ఒక సమయంలో బహుశా జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్దాలు ఉన్నాయని లేబొరేటరీ రిపోర్ట్ ద్వారా నిరూపించి కోక్ ,పెప్సీ కోలా  కంపెనీ లను అదరగొట్టారు . సునీత . పండ్లు మగ్గపెట్టటంలో వాడుతున్న రసాయనాల నిషేధపు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిందన్న ,ఢిల్లీ వీధుల్లో డీజిల్ ,ఆటోలు ,వాహనాలు పోయి సి. ఎల్ జి వాడకం వచ్చిందన్న దాని వెనుక సునీత నారాయణన్ సేకరించిన సమాచారం ఉంది భూ కాలుష్యం ,జల  కాలుష్య కారణాలనన్నింటిని డాక్యుమెంట్ చేస్తుంది సునీత నారాయణన్ నాయి కత్వం లోని సంస్థ . 2005 లో ఆమె ను పద్మ శ్రీ తో సత్కరించింది ప్రభుత్వం .

Leave a comment