గీతాకాలే . షూర్ కేర్ మెసీ . బర్యన్ . ఆధార్ కార్డ్ వెరీఫైడ్ టైటిల్ తో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఓ విజిటింగ్ కార్డ్ జోరుగా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది . ఒక పనమ్మాయి నానంబర్ ఇదిగో ,నేను ఫలానా పనికి ఇంత ఛార్జ్ చేస్తాను ,ఈ ఈ వేళ్ళల్లో ఫలానా పనులు చేస్తాను ,అవసరం ఉంటే ఫోన్ కొట్టు అని కార్డ్ వేయించుకొంటే ,చూశారా ఎంత గర్వమో ,అని కావచ్చు ,చుడండి రోజులు మారిపోయాయి అనీ ఆశ్చర్యంతో కావచ్చు . లేదా చూడండి ఎంత దీమా గా తాను ఎంత విలువైన మనిషిని అని చెప్పుకొంటోందో అని మెచ్చుకోలు కూడా కావచ్చు . ఎవరెలా తీసుకొన్నా గీత విసిరిన ఈ కార్డు గొప్ప సంచలనం . ఇంత చక్కగా మన రైతులూ మా గిట్టుబాటు ధర ఇదీ అని అడగలేరు ,ఇంట్లో 24 గంటలు అడ్డమైన చాకిరీ చేసే హౌస్ వైఫ్ కూడా ఆమెకు విలువ కడితే నీ సంపాదన సరిపోతుందా అని భర్తను అడగలేదు . గీత మాత్రం తన సర్వీసుకు ఓ విలువ ఇచ్చుకుంది . నిన్ను నువ్వు గుర్తించావు గీతా !

Leave a comment