సలాడ్ కన్నా రుచిగానో, పోషకాలు ఎక్కువగా నో, కేలరీలు తక్కువగానో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం సూప్.ఏ పదార్థం అయినా అందులో ఉండే పోషకాలు అన్నింటిని నీళ్ళలోకి వచ్చేలా మరిగించి ద్రవ రూపంలో తీసుకుంటే అది సూప్.సూప్ ల్లో కెల్ల అద్భుతమైంది చైనా, జపాన్ లో శతాబ్దాల నుంచి తాగుతున్న మిసా సూప్.కోజి అనే ఈస్ట్ సాయంతో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు పులియ పెట్టిన సోయాబీన్స్ ముద్దతో మిసా సూప్ తయారు చేస్తారు. ఇందులో బియ్యం, బార్లీ, గోధుమలు కలుపుతారు దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ బి12,బి2,ఇ,కె విటమిన్లు కొలాన్  లినోలిక్ ఆమ్లాలు పీచు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.వృద్ధాప్యాన్ని దగ్గరకు రానివ్వని ఈ సూప్ ని మహిళలు రోజుకు ఒక కప్పు తాగితే ఈస్ట్రోజెన్ హార్మోన్ శాతం తగ్గదు.ఈ సూప్ పౌడర్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతోంది.

Leave a comment