విద్యాదాస్ మూడున్నర దశాబ్దాల పాటు గిరిజనుల గురించి ఒక రకంగా పోరాటమే చేసింది .ఒరిస్సా లోని రాయిగడ జిల్లా గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు .అవన్నీ ప్రభుత్వ సంస్థలకే అమ్మాలని నియమం .ఎంతో తక్కువ ధరకు వాటిని కొని కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ తో వాటిని ఎన్నో రెట్లు ఎక్కువకు అమ్ముకొనే వాళ్ళు చివరకు చీపుర్లు తయారీ చేసే చీపుర్లు గడ్డి కూడా వాళ్లకు దక్కేది కాదు .వాళ్ళకోసం అగ్రగామి పేరుతో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి ఆ గిరిజనులతో కలసి ఆ గడ్డి ని అమ్మకుండా పోరాటాలు చేశారు .బ్యూమ్ రివెల్యూషన్ గా ఆ నిరసన ఏడేళ్ళు సాగింది .చివరికి ప్రభుత్వం దిగి వచ్చి గిరిజనుల వాళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులు వాళ్ళే అమ్ముకొనేలాగా చట్టం చేశారు .ఎంతో కాలంగా భూస్వాముల దగ్గర వెట్టి చాకిరీ చేసే గిరిజనుల పిల్లలు ఇప్పుడు బడిబాట పట్టారు .

Leave a comment