ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ కధానిక … జప , తపా లతో దైవిక చింతనలో ఉండే గౌతమ మహర్షీ … ఆశ్రమ కార్యకలాపములతో భర్త సపర్యల్తో మానసికోల్లాసం కలగక ప్రేమానురాగాలకొరకు తపిస్తూఒక దివ్య స్వప్నం లో కనిపించిన ఇంద్రుని ప్రేమించిన ఆయన భార్య అహల్యా ..ఆమె రూప ,లావణ్యాలకు ముగ్ధుడైన మహేంద్రుడూ …ఈ సుప్త శిల లో ప్రధాన పాత్రధారులు ..
ఇక ఈ వ్యవహారం కళ్లారా చూచిన గౌతముని పలుకులు ,శాపవచనములు, పశ్చాత్తాపం…అహల్య బాధాతప్త సందేశం … అహల్యాగౌతములతో
ఇంద్రుని సంభాషణ లతో తిలక్ మనకు అలౌకిక అనుభూతి కలిగిస్తాడు. తెలుగు సారస్వత జగత్తులో అగ్రశ్రేణి రచయిత తిలక్ రచనల్లో ‘సుప్తశిల ‘ ఓ ఆణిముత్యం .

Leave a comment