ఇప్పుడు పూర్తిగా ఎ.సీల్లోనే గడిపేస్తుంటారు. ఇక ఆఫీస్ లయితే సెంట్రల్ ఎ.సి ఇక పూర్తిగా మూసేసిన తలుపుల మధ్య పని చేసేవారికి సరైన కాంతిలోపించడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి డిప్రెషన్ కు ఒక్కటే గుర్తు. వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల ఆసక్తి వుండదు. ఏకాగ్రత కుదరదు చాలా అలసట గా వుంటారు. ఎక్కువసేపు నిద్రపోతారు కూడా. దిగులుగా, చిరాకుగా కార్బోహైడ్రేడ్స్ పట్ల ఇష్టంతో వుంటారు. దీనికి ముందు కాంతికి ఎక్స్ పోజ్ కావడమే. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా చుస్తే లేదా ఉదయపు ఎండలో వాకింగ్ చేస్తే, శరీరానికి ఎండ తగలనిస్తే జీవక్రియలు, జీవగడియారపు పనితీరు మెరుగుపడి డిప్రెషన్ తగ్గిపోతుంది.

Leave a comment