సబ్బులు షాంపులు చక్కని సువాసనతో ఉండేవే ఎంచి తీసుకొంటూ ఉంటాం. గుభాళింపు లేకుంటే ఆ ఉత్పత్తి అవతల పెడతాం. అయితే సబ్బులు ,షాంపులు కండిషనర్ లు ఇతర కాస్మొటిక్స్ లోని పదార్థాలలోని సువాసనలు ఎగ్జిమాను పెంచేందుకు దోహాద పడుతాయి అంటున్నాయి అధ్యయనాలు. వీటిలో వాడే నికెల్ ,లినాలూక్ ,కోబాల్ట్ అనే పదార్థాలు ఎలర్జీ కలిగించే గుణాలతో ఉంటాయి. ఆక్సిడ్రైజ్డ్ లినాలూల్ ఎగ్జిమా వచ్చేందుకు ఎక్కువగా కారణం అవుతుంది. లవెండర్ ,మింట్ లలో సహాజంగా కనించే సువాసనా పదార్ధలినాలూల్ ,ఆక్సిజన్ తో కలిసినప్పుడే ఎలర్జీకీ దారి తీస్తుంది. ఈ ప్రభావం తగ్గించేందుకు పెద్దపైజు పాకెట్లు కొనకుండా నిషేధించాలి. చాలా చిన్న పాకెట్లు వాడితే ప్రభావం అంత ఉండదు.

Leave a comment