సంగీతంలోని కొన్ని రాగాలు శరీరంలోని నరాలను ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగాల ఆరోహణ అవరోహాణ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. బాగేశ్వరీ మాత్కీన్స్ ,తోడి ,పూర్వా,ఆహరి భైరవి రాగాలు రక్త పోటును అదుపులో పెడతాయి. కాఫీ దర్బరీ రాగాలు మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి.శివరంజని అద్భుతమైన తెలివి తేటల కోసం ,మానసిక సమస్యలు తగ్గించుకొనేందుకు అసావేరి రాగం ఉపయోగం. సారంగ్ కుంటుంబానికి చెందిన కల్యాణి ,చారుకేసి రాగాలు హృదయ సంబంధిత సమస్యలు దూరం చేస్తాయి. భాగేర్విక్,జయ జయంతి రాగాలు వధుమేహం ఉపశమనం కలిగిస్తాయి. మంద్రస్థాయి నుంచి మధ్యస్థాయి వరకు సాగే భజన పాటలు మనసుకు ప్రశాంతత ఇస్తాయి. ఒత్తిడి ఆందోళనలకు సంగీతంతోనే ఉపశమనం కలుగుతుందని చెపుతున్నారు.

Leave a comment