స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా వినోద్ కుమార్. ఇది క్లినికల్ ట్రీట్మెంట్. స్వర ఆధారిత సాధన, స్వర యోగా, స్వర రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలు, సహకారాలు ఇస్తారు. డా శ్యామల వినోద్ కుమార్ ఈ వోక్సాలజీ కొర్స్ చేసిన తోలి భరతీయిరాలు. భావోద్వేగాలు స్వరం పైన ప్రభావం చూపెడతాయి. మన గొంతులో వాటిని వినిపిస్తాం. కోపం, ఆవేశం, ఇష్టం, సంతోషం ఇవన్నీ గొంతుతో పలికే భావాలు. పాటనేర్చుకోవడం కోసం ఇలాంటి ఉద్వేగాలు నియంత్రించుకుని చెక్కని స్వరం తో పాడటం కోసం ఈ వోక్సాలజీ క్లాసెస్ ఉపయోగ పడతాయి. ఈ స్వరాని సంరక్షించే విద్య నేర్చుకున్న శ్యామల గారికి శుభాకాంక్షలు.

Leave a comment