పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాకనే తనకి ఇష్టమైన క్రీడలో అడుగుపెట్టి అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన ఇరవై నాలుగేళ్ల రాజనాల పూర్ణ. బి ఏ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణ గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో జూనియర్ సీనియర్ విభాగాల్లో మూడు స్వర్ణాలు రెండు కాంస్యాలు సాధించింది 2021 డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా స్థాయి పోటీల్లో యాభై రెండు కిలోల జూనియర్ విభాగాల్లో పాల్గొని నాలుగు స్వర్ణాలు సాధించింది.

Leave a comment