ఆరో సంవత్సరం లోనే టెన్నిస్ రాకెట్ పట్టిన షేక్‌ జఫ్రీన్‌ కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. అమ్మ నాన్న రెహనా, జాకీర్ తీవ్ర ప్రయత్నం తో మాటలు నేర్చుకుంది. గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రత్యేక ఒలంపిక్స్ లో పాల్గొన్న జఫ్రీన్‌ తాజాగా పృథ్వీ శేఖర్ తో కలిసి మిక్స్ డ్  డబుల్స్ లో స్వర్ణం సాధించింది. 2013, 2017 లో డెఫ్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ గేమ్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధం అవుతున్న జఫ్రీన్‌ ఈ సారి స్వర్ణం నా లక్ష్యం అంటోంది. 2021లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ దివ్యంగా క్రీడాకారిణి పురస్కారం అందుకున్న ఇటీవలే ఎం.సి.ఎ పూర్తి చేసింది.

Leave a comment