వత్తిడిని తట్టుకునేందుకు ప్రాణాయామం మంచిది అంటున్నారు. ఇందుకోసం తగిన పద్ధతులు ప్రక్రియలు అవలంభించాలి. బ్రీత్ వాచింగ్ ప్రాణాయామం లో ఒక్క పద్ధతి. శ్వాసపైన ద్యాస ఉంచడం అంటారు. ఇది కొన్ని నిమిషాల సమయంలో చేయవచ్చు. చేయవలసిన సింపుల్ పని శ్వాస పీల్చే సమయంలో ఛాతీ లేదా ఉదరం వదిలేటప్పుడు పైకి లేవడం లేదా కిందకు తగ్గడం ఏ విధంగా గమనించాలి. కళ్ళు మూసుకుని ఊపిరి తీసి వదలటాన్ని పరిశీలించాలి. గాలిని ముక్కు లోకి పీల్చడం దాన్ని గుండెలదాకా నిలపడం పై ద్యాస నిలపాలి. గాలి పీల్చి వదిలే సమయం లో సెకండు గ్యాప్ ఉంటుంది. దీన్ని గమనించాలి. ఈ నాలుగు అంశాలను పరీక్షిస్తూ మూడు నాలుగు సార్లు చేయాలి. మొత్తం బ్రీతింగ్ సైకిల్ పై ద్రుష్టి పెట్టాలి.

Leave a comment