పెళ్ళయ్యాక స్త్రీకి రక్షణ ఉంటుంది కానీ స్వేచ్చ పోతుంది అంటుంది హాలివుడ్ నటి నికోల్ కిడ్ మన్. మీ కెరీర్ ప్రారంభంలో తర్వాత మీకు వేధింపులు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ టామ్ క్రూజ్ నా మొదటి భర్త అతనితో ఉన్నప్పుడు నాకు లైంగిక వేధింపుల సమస్యలు లేవు. కానీ స్వేచ్చ లేకపోయింది అటు తర్వాత కీత్ అర్దన్ ను పెళ్ళీ చేసుకున్నాక రక్షణ తో పాటు స్వేచ్చ వచ్చింది. స్వేచ్చ పెళ్ళైన స్త్రీని శక్తివంతురాలిగా మారుస్తుంది. ఆమె రక్షణ కోసం భర్త పై ఆదారపడి ఉండవల్సిన అవసరం లేదు. కీత్ ను నేను ప్రేమించి పెళ్ళాడాను.ప్రేమ నాకు అన్ని ఇచ్చింది అంటుంది నికోల్ కిడ్ మన్.

Leave a comment