పిల్లలకు తియ్యగా ఉండే బలవర్ధకమైన ఫలహారం తినిపించాలి అనుకుంటే స్వీట్ పొటాటో ఖీర్ చేసి ఇవ్వచ్చు చిలకడ దుంపలు నెయ్యి కొబ్బరి కోరు,బెల్లం డ్రై ఫ్రూట్స్ యాలుకల పొడి తో ఈ పాయసం తయారు చేయవచ్చు. ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి కోరు,బెల్లం తురుము,కాసిని నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేతిలో మనకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకోవాలి ఆ నెయ్యిలో చిలకడ దుంప ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసిన కొబ్బరి తురుము బెల్లం కూడా చిలకడ దుంప ముక్కల్లో వేసి ఐదు నిముషాల్లు స్టవ్ పై నుంచి దించుకోవాలి. వేడిగా ఉన్నపుడే డ్రై ఫ్రూట్స్ ముక్కలు చల్లి సర్వ్ చేసుకోవచ్చు.
కావల్సినవి:
స్వీట్ పొటాటో ఉడికించినవి ఒకటిన్నర కప్పులో,నెయ్యి రెండు స్పూన్ లు బెల్లం తురుము ముప్పావు కప్పు డ్రైఫ్రూట్స్,యాలుకల పొడి ఆరస్పూన్ సరిపోతాయి