సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్  చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత  ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . కానీ తమాషా గా బాహుబలి – 2పోస్టర్ తో అనుష్క చాలా అందంగా వుంది. కానీ సినిమా లేటయిపోతుందనే భయంతో అనుష్కను గ్రాఫిక్స్ తో చక్కగా మార్చేశారని టాక్. గ్రాఫిక్స్ తో ఎలాంటి అద్భుతాలైన చేయచ్చని దానికి అనుష్క ఒక లైవ్ ఉదాహరణ అని చెపుతున్నారు. ఇది అమ్మాయిలకో  హెచ్చరిక. మొదటినుంచి యుక్త వయసు వచ్చిన దగ్గరనుంచి ఒక తీరైన సౌందర్యం తో ఉండాలంటే ముందుగా తినే వాటిపైన దృష్టి  పెట్టాలని బరువు చూసుకుంటూ మితంగా మాత్రమే తింటూ నోటికీ కళ్ళకీ రుచి ఇచ్చే తియ్యని పదార్ధాలకు వీడ్కోలు చెపుతూ ఆరోగ్యంగా ఉండండంటున్నారు డైటీషియన్లు.

Leave a comment