Categories
WhatsApp

స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.

మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని క్లోరిన్ చర్మానికి, జుట్టుకు హాని చేయ కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు. స్విమ్మింగ్ పూల్ లోని రసాయినాలు బ్లీచింగ్ లు శిరోజాలకు హాని కలిగిస్తాయి. చర్మం సూర్యకిరణాల వల్ల ట్యానింగ్ కు గురవ్వుతుంది. స్విమ్మింగ్ కు ముందు తర్వాత షవర్ చేయాలి. దీని వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. రసాయినాల్లో ఎక్కువసేపు నానినట్లు ఉండదు. స్విమ్మింగ్ క్యాప్, గాగుల్స్ పెట్టుకుంటే చర్మాన్ని కళ్ళని పరిరక్షించుకున్న వాళ్ళు అవ్వుతారు. పూల్ లోకి ప్రవేశించటానికి 10-15 నిమిషాల ముందే చర్మానికి వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. పూల్లో ఎక్కువ సేపు ఉండేటట్లు అయితే ప్రతి రెండు మూడు గంటలకు ఒక సారి అప్లయ్ చేస్తూ వుండాలి.

Leave a comment