ఈ రోజు కృష్ణాస్థమి యశోదా నండనుడి పుట్టిన రోజు పురాణాల ప్రకారం శ్రీ ముఖ నామ సంవత్సర శ్రవణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధ రాత్రి జన్మించాడు కృష్ణుడు. ఈ రోజు కృష్ణుని పూజిస్తే అన్ని పనుల్లో జయం కలుగుతుందని నమ్మకం ఉత్తరాదిన చాలా మంది భక్తులు ఈ పండగ ముందు రోజు ఉపవాసం చేస్తారు. ఈ రాత్రికి జాగరణ చేస్తారు కృష్ణుడు అర్ధరాత్రి జమించాడు కాబట్టి కృష్ణుని ప్రతిమకు మంగళ స్నానం చేయించి, అలంకారించి నైవేధ్యం సమస్పించి ఊయల సేవా చేస్తారు. ప్రసాదం తీసుకుని ఉపవాసం ముగిస్తారు. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళ నాడు, కర్ణాటక లో కుడా ఈ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుతారు. దేవకీ పుత్రుడు, యశోదానందనుడు అయిన శ్రీ కృష్ణని వర్ణిస్తూ అధరం  మధురం మధురాదిపాయే సకలం మధురం అన్నారు.

Leave a comment