శరీరం బరువు మొత్తం పడేది పాదాలపైనే . వందకు పైగా కండరాలు ,లిగమెంట్లు ,టెండన్లు , 33 జాయింట్లు ఉంటాయి. ఇరవై ఆరు ఎముకల సముదాయం ఉంటుంది. ఇంత శక్తితో శరీరాన్ని మోసే పాదాల షూస్ ఎంపిక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. షూస్ ,చెప్పులు సాయంత్రం వేళన కోనాలి. ఆ సమయంలో పాదాలు సరైన ఆకృతిలో ఉంటాయి. టీ స్ట్రాప్ శాండీల్స్ పాదాల ఒంపుకు అనువుగా ఉండి అద్భుతమైన సపోర్ట్ షూస్ గా పరిగణించాలి. సపోర్ట్ లేకుండా నడిస్తే కాలి వేళ్ళు పాదాల కండరాలు నడిచే సమయంలో షూ గ్రిప్ కోసం నిరంతరం స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది.

Leave a comment