భోజనం చేయగానే తాంబూలం వేసుకునే అలవాటు ఇప్పుడు ఎంత మందికి వున్నాడో అసలు రైస్ తినడం మానేసి రెండు పుల్కాలు కురతో సరి పెట్టు కునే రోజుల్లో తమలపాకులు ఎంత మంది ఫ్రిజుల్లో వున్నాయి. సరే వున్నా లేకున్నా తమ్మల పాకుల్లో ఔషధ విలువలు తెలుసుకున్నాక కొందరయినా తాంబూలం వేసుకుంటారేమో. దీన్ని నాగవల్లి అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ధైమిన్ నియాసిన్, రెబోఫ్లెవిన్, కెరోటిన్ వంటి వితమిన్లతో పాటు కాల్షియం కుడా సమృద్దిగా దొరుకుతుంది. మధుమేహం వుబకాయం వేగాన్ని పెంచి కొవ్వును తగ్గిస్తుంది. తమలపాకు ఘాటుగా ఉండటానికి కారణం ఇందులోని చవికాల్ అనే ఫినాలిక్ పదార్ధం. ఇది యాంటీ సెప్టిక్ గా పని చేసి పుండ్లను నివారిస్తుంది. అలసట టీ స్పూన్ తేనె లో తమలపాకు రసం కలిపి తీసుకుంటే మంచి టానిక్ లాగా పని చేస్తుంది. కాల్షియం లోపం వస్తే ఈ ఆకులు రెండు నెలల పాటు రోజుకి రెండు ఆకులూ తిన్నా ఫలితం కలిగిస్తుంది.

Leave a comment