ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు ఇతరుల్ని ట్యాగ్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఫేస్ బుక్ లో ఇతరుల ఫోటోలు పెట్టేప్పుడు వాళ్ళ అనుమతి తీసుకోవాలి. కొందరు తమ ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వాళ్ళు చూడకుండా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకుంటారు. అందుకు అనుమతి తీసుకోవాలి విహార యాత్రకు,పుణ్యకేత్రాలకు వెళితే చెక్ ఇన్ స్టేటస్ పెట్టి తనతో వచ్చిన స్నేహితులకు ట్యాగ్ చేస్తారు. కొందరికి వ్యక్తిగత విషయాలు అందరితో షేర్ చేయటం ఇష్టం వుండదు. సినిమాకు వెళ్ళి,కొత్తప్రదేశాలు చూసి తమ ఫీలింగ్స్ రాసుకొని ఫేస్ బుక్ లో పెట్టుకుంటరు ఇలాంటి పోస్టులకు ఇతరులను ట్యాగ్ చేస్తే ప్రతి పోస్టుకు లైక్ కామెంట్ వస్తే వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళే అవకాశం వుంది. అందుకే ట్యాగ్ చేసే ముందర కాస్త ఆలోచిస్తే మంచిది.

Leave a comment