నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ పది రోజులకో సారి బరువు చూసుకుంటే ఎంత తగ్గుతున్నారో తెలుతుంది. ఆ తగ్గిన బరువు ఇంక పెరగనీయ వద్దు. వండుకునే విధానంలో మార్పు రావాలి. వేపుళ్ళు మానేసి గ్రిల్, బేక్, ఆవిరి మీద ఉడికించిన పదార్దాలే ఎంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో బయటకు వెళ్ళినా నూనె, వెన్నా, నెయ్యి, క్రీమ్ లాంటివి, మైదా తో వండినవి ఎప్పుడూ ముట్టుకోవద్దు. సరదాగా కాలక్షేపం చేస్తూ కూడా సలాడ్లు, పళ్ళ రసం ఓ గ్లాసుతో సరిపెట్టుకోవాలి. మొత్తానికి బరువు తగ్గాలంటే తిండి పైన ఓ కన్నేసి వుంచాలి, అంతే.

Leave a comment