మొహం పైన వైట్ హెడ్స్ తగ్గించుకోవాలంటే వంట ఇంట్లో ఉండే పదార్థాలు ఉపయోగపడతాయి.వంట సోడా లో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని వైట్ హెడ్స్ పై రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.అలాగే ఆపిల్ సిడర్ వెనిగర్, నీళ్లు కలిపి ప్రయత్నం చేయవచ్చు.అలాగే మూడు స్పూన్ల చొప్పున పెసర పిండి, శెనగపిండి తీసుకోవాలి.దీనిలో పాలు నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి ఆరిపోయాక కడిగేస్తే చాలు కొన్నాళ్ళకు వైట్ హెడ్స్ తగ్గిపోతాయి.గుప్పెడు వేపాకులు అందులో స్పూన్ పసుపు వేసి మెత్తని ముద్దలా చేసి ఈ మిశ్రమాన్ని వైట్ హెడ్స్ ఉన్న చోట రాసి ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి ఇలా చేస్తూ ఉంటే వైట్ హెడ్స్ తగ్గిపోతాయి.

Leave a comment