ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఇద్దరి మధ్య తగవులు వస్తూనే ఉంటాయి. ఈ గొడవలు తగ్గించాలంటే పెద్దవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న వాళ్లకు తెలియదని పెద్దవాళ్లు సర్దుకుపోవాలి అని చెప్పవద్దు ఇద్దరు పిల్లలతో సమానమైన సమయం కేటాయించి ఇద్దరికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్లలో శక్తిసామర్థ్యాలు ఒకేలా ఉండవు.వారి బలాబలాలను గుర్తించి ప్రోత్సహించాలి కానీ ఒకళ్ళను  మరొకాళ్ళ లాగా నడుచుకోమని చెప్పవద్దు దానితో అనవసరంగా అసూయత వస్తాయి.

Leave a comment