పువ్వుల అలంకరణ పెళ్ళిళ్ళకు పేరంటాలకు అక్కరలేదు.ఇంట్లో ప్రతి మూలా పువ్వులని అలంకరిస్తే ఇంటి అందం మారిపోతుంది. సీజన్ లో వచ్చే ప్రతి పువ్వులు ఇంటి అందం పరిమళం ఇచ్చేసు పువ్వులు ఎక్కువ సమయం వాడిపోకుండా ఉండాలంటే పొడవాటి కాడలతో కొంచం విచ్చుకున్న మొగ్గలను ఎంచుకోవాలి. వీటిని నీటితో నిండిన వాజ్ లో వుంచి. నీళ్ళు ప్రతి రోజు మార్చాలి. ఆ నీటిలో స్పూన్ పంచదార వేయాలి. నీళ్ళు మార్చినప్పుడల్లా కాడలు కొంచెం కట్ చేయాలి. వదిన పూల రేకులు, ఆకులూ తీసివేయాలి. పువ్వులు పెట్టిన వాజ్ గానీ పాత్ర గానీ పొడిగా చల్లగా వున్న చూట పెట్టాలి. నేరుగా ఎండ తగిలె చొట ఉంచకూడదు. పువ్వుల్ని నాలుగైదు రోజుల పాటు తాజాగా ఉంచేందుకు వీటి కాడలు గోరువెచ్చని నీటిలో వుంచి, వెంటనే చల్లని నీటి లోకి మార్చాలి. ఇలా చేస్తే రాలెందుకు సిద్ధంగా వున్న పూల రేకులు కుడా భద్రంగా ఉంటాయి.

Leave a comment