తలకింద మెత్తని తలగడ వుంటేనే  నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే  ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ మొటిమలకు కారణం అవుతాయి. డస్ట్ మైట్స్ కూడా దిళ్ళలో నివాసం ఏర్పరుచుకుంటాయి. వాటివల్ల ఆస్తమా ఇతర ఎలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలు 20 శాతం మంది బాధపడుతున్నారంటే వారిలో రెండొంతుల మందికి బెడ్స్ పై నివసించే డస్ట్ మైట్స్ కారణం అవుతుంటాయి. వీటిని మంచి ఎండలో ఆరబెడుతూ ఉండాలి. నాలుగైదు రోజులకు దిండు కవర్లు మార్చేయాలి.

Leave a comment