ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ వల్ల పేరు మార్మోగుతుంది. ఇప్పుడీమె పేరు అలాగే నలుగురికీ ఆదర్శం రేఖామిశ్రా వుండేది ముంబాయిలో రైల్వే ప్రోటెక్షన్ ఫోర్సులో సబ్ ఇన్స్ పెక్టర్. ఇల్లు విడిచి వచ్చిన, తప్పిపోయిన పిల్లల పాలిట ఈమె దేవత. గత ఏడాది ఈమె 434 మంది పిల్లల్ని రక్షించారు. 2014లో రేఖా మిశ్రా విధుల్లో చేరారు. అలహాబాద్ కు చెందిన ఆర్మీ కుటుంబం నుంచి వచ్చారు రేఖా. ముంబాయి అంటే రంగుల లోకం సినిమాలకు కేరాఫ్. అడుగడునా తోడేళ్ళ వంటి మన్యుషులు. ఏ సినిమా పిచ్చి తోనో,పరీక్ష తప్పో , ఇల్లు వదలి వచ్చేసిన పిల్లల పాలిట ఈమె కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మూడేళ్ళ సర్వీస్ లో డ్యుటీలో వున్నా లేకపోయినా పిల్లల్ని బాధ్యతగా తీసుకుంటుంది రేఖామిశ్రా వృద్దులకు, పిల్లలకు చేయూతనివ్వాలన్నదే ఆమె కోరిక.

Leave a comment