నెట్ ఫ్లిక్స్ టీన్ కామెడీ సీరీస్ నెవర్ హ్యావ్ ఐ ఎవ్వర్ లో లీడ్ రోల్ లో నటించిన మైత్రేయి రామకృష్ణన్ కెనడా అమ్మాయి. ఈ పాత్ర కోసం పదిహేను వేల మంది పోటీ పడితే వాళ్లలో ఎంపికయింది మైత్రేయి. దేవి విశ్వ కుమార్ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అక్కడ నుంచి ఆమె హాలీవుడ్ సినిమాల ప్రయాణం మొదలైంది. అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ టోర్నింగ్ రెడ్ లో ఆమె నటించింది. బ్రేక్ అవుట్ యాక్టర్ గా టైమ్స్ -100 ఇన్ ఫ్లూయెన్షల్ పీపుల్ 2017 జాబితాలో మైత్రేయి పేరు చోటు చేసుకుంది. టాలెంట్ కి ఎల్లలు లేవు.

Leave a comment