Categories
ఇది కొంచం ఇంటరెస్టింగ్ రేపోర్టు. స్వీడన్ పరిశోధనలు రెండు లక్షల మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం చేసిన అధ్యాయినంలో గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకుంటే వుండవసిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారని, ఆ బరువు కడుపులో వున్న శిశువు మెదడు, గుండె పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. బరువు ఎక్కువగా వున్నా తల్లుల పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతిగా వున్నా సమయంలో తల్లి తీసుకున్న ఆహారం ప్రభావామే అని స్పష్టం చేసారు. గర్భవతులు తిసుకోవలిసన జాగ్రత్తల్లో అధిక బరువు నియంత్రణ మొదటిగా వుండాలని వారు సూచించారు. ఈ ఒక్క కారణం వల్లనే పిల్లల మెదడు ఎదగాపోవడం గుండె ఆరోగ్యం లో మార్పులున్నాయని పరిశోధన ఫలితాలు చెప్పుతున్నాయి.