బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు ఎప్పుడు బిడ్డకు ఆకలేస్తే అప్పుడు తాగించే వీలుంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు. పాపాయికి పాలిచ్చే సందర్భంలో ఎవరైనా కళ్లప్ప గించి చూస్తుంటే ఇబ్బందే కానీ ఆ మనిషి కళ్లలో కళ్ళు పెట్టి చూసి స్నేహంగా నవ్వితే చాలు వారు ఇక తల తిప్పి చూడరు. పాపాయి తల అటు ఇటు తిప్పినా వేళ్ళు నోట్లో పెట్టుకొంటున్నా ఆకలేస్తోందని అర్ధం, ఏడ్చేదాకా ఆగక్కర్లేదు. కానీ ఎక్కడ ఏ సమయంలో పాలు తాగించినా సరైన పొజిషన్ లో కూర్చోవాలి . కూర్చుని తర్వాత బిడ్డను ముంజేతుల పై సన్నిహితంగా పట్టుకుని సౌకర్యాన్ని సరి చూసుకుని స్తన్యం ఇవ్వాలి.తల్లికి బిడ్డకు సౌకర్యంగా ఉండేలా పొజిషన్ సరిచూసుకోవాలి. నర్సింగ్ బ్రా లేదా టాప్ ధరిస్తే వాటికి వుండే కవర్ ఫ్లాప్స్ ల్యాబ్స్ వల్ల ఒక చేత్తో ఓపెన్ చేయచ్చు. లేదా ముంజేతిపైన ఓ వస్త్రం కాపుకుంటే తక్షణ కవరప్ లా పనిచేస్తుంది.
Categories
WoW

తల్లిపాలతో బిడ్డకు తల్లికీ సుఖం

Leave a comment