Categories
Nemalika

తల్లి దండ్రులకు పిల్లలు అర్థం కావాలి.

నీహారికా,

తల్లి దండ్రులకు వయసులో ఉన్న పిల్లలలకు మాంద్యాని మంచి అవగాహన ఉంటేనే వాళ్ళ భవిష్యత్ చక్కగా రూపం దిద్దుకొంతుందని ఒక అద్యయనం చెపుతోంది. తల్లి దండ్రులలకు పిల్లల చదువులు, ఉద్యోగాలు గురించి మంచి అంచనాలు ఉండాల్సిందే. అయితే ఆ అంచానాలు పిల్లల శక్తి సామర్ద్యాలకు మించి ఉంటె అప్పుడు పిల్లల భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. అమ్మ, నాన్న తమ ఆసక్తుల దిశగా ఆలోచించడం లేదని తెలిపోగానే వాళ్ళ తమ అభిప్రాయలు స్పష్టంగా చెప్పటం పిల్లల భాద్యత.  కీలకమైన తరుణంలో మొహమాటపడితే జీవితాంతం పశ్చాత్తాపం మిగులుతుంది. తమకీ రంగం అంటే ఇష్టం అని పిల్లలు చెప్పాలి. పిల్లల్ని తల్లి దండ్రులు అర్తం చేసుకోవాలి. మూర్ఖంగా ప్రవర్తిస్తే పిల్లల బందాలు భవిష్యతులో చేతులారా చిదిమేస్తున్నామని పేరెంట్స్ తెలుసుకోవాలి. అలాగే యువత కెరీర్ దిశగా నడుస్తున్నప్పుడే ఆ లక్ష్యాల దిశగా ఎలాంటి ఆకర్షణలకు లోనూ కాకుండా ఉండాలి. జీవితంలో స్థిరపడే సమయం ఇదే. అల్లాగే పిల్లల ఆశలు భిన్నంగా ఉంటాయని ఆ వయస్సులో తాము అలాగే ఉన్నామని తల్లిదండ్రలు తప్పని సరిగా ఆలోచించాలి.

Leave a comment