తమలపాకును నాగవల్లి అని కూడ అంటారు ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ,ఎ,సి విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటి ఆక్సిడేంట్ వృధ్ధాప్య లక్షణాలు త్వరగా రానివ్వదు. తమలపాకు, సున్నం, వక్క మూడు మంచి కాంబినెషన్. తమలపాకులో రసం సున్నంలోని కాల్షియన్ని శరీరం అంతర్బాగంలోకి తీసుకువెళుతుంది. ఈ తీగను కూండిలో నేలలో కూడ వేసుకోవచ్చు. జీర్ణ శక్తికి చాలా మేలు చేస్తుంది. చిన్నపిల్లలకు తేనే, తమలపాకు రసం నాకిస్తే దగ్గు,జలుబు తగ్గుతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆధిక దిగుబడిచ్చే కపూరి రకం తమలపాకు తోటలు పేంచుతారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకు తీగను ఇంట్లో కుండిలో నాటుకుంటే చిన్నచిన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Leave a comment