Categories
తమిళనాడులో 108 వాహనం నడిపే తొలి మహిళగా గుర్తింపు పొందింది వీరలక్ష్మి. చిదంబరం లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా కోర్స్ చేశారు.చెన్నైదగ్గర లోని తిరువేర్కాడులో నివాసం. భర్త కారు డ్రైవర్ అతని దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుని టాక్సీ నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా108 వాహనాల సంఖ్య పెంచింది.వాటికి డ్రైవర్ లను ఎంపిక చేస్తారనే విషయం తెలుసుకుని దరఖాస్తు చేసింది వీరలక్ష్మి.ఆమె కోరుకున్నట్లు గానే తిరువళ్లూర్ జిల్లా లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ గా నియమిస్తూ ఆర్డర్ వచ్చింది.ఆ రాష్ట్రంలో 108 అంబులెన్స్ తొలి మహిళ డ్రైవర్ వీరలక్ష్మి. ఈ కొత్త బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తా అంటోంది వీరలక్ష్మి.