Categories
బాలీవుడ్ దక్షిణాది తేడా లేకుండా మీటూ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా బాలీవుడ్ గాయనీ సోనా మహాపాత్ర. గాయకుడు ఖైలాష్ ఖేర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఒక కాన్సెప్ట్ కోసం కాఫీ షాప్ లో కైలాష్ ని కలిసినప్పుడు మీరు చాలా అందంగా ఉంటారని నాపై చేతులు వేశాడు. నేను అక్కడ నుంచి పారిపోయాను. ఆ తర్వాత మేం ఢాకా వెళ్ళాం. ఫ్లైట్ దిగినప్పుడు నుంచి నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను తీయలేదు దాంతో షో నిర్వాహకులకు చెప్పి నాతో ఫోన్ చేయించుకున్నాడు. కచేరి వదిలి తన గదికి రావాలని కోరాడు. నాకెంతో అసహ్యం అనిపించింది. ఇప్పటికి అతని గురించి నేను బయటకి వచ్చి పనిచేసింది తక్కువే అని ట్విట్ చేసింది.