బ్రెండ్ లో ఏదైన జామ్ తినాలి అనిపిస్తే జామ్ తో చేసింది ఎంచుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే జామ లో విటమిన్ ‘సి’ స్థాయిలు నాలుగు నుంచి పదిరెట్లు అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ ‘సి’ లోని ఇంకా అద్భుతమైన గుణం వార్థక్య  లక్షణాలను తగ్గించటం.  జామ కాయలు రెగ్యూలర్ గా తింటూ వస్తే చర్మం బిగురుగా ,యవ్వనంగా కనిపిస్తుంది. కాపర్ వంటి ఖనిజాలకు అద్భుతమైన ఆహారం ఇది, విటమిన్ ఎ ,ఫాలోయినెడ్ లు పుష్కలంగా దొరికే జామ పండు తిన్న , జ్యూస్ తాగిన ఇంకే రూపంలో తీసుకున్న ఉపయోగమే .రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి ,మెయిట్ మెనేజ్ మెంట్ కు సహకరిస్తుంది ఈ జామ పండు.

Leave a comment