తోడొక రుండినా అదే భాగ్యము అన్నాడో సినీ కవి. అది చక్కని పాతనుకోండి. కానీ ఇప్పుడో అధ్యాయినం ఏం చెప్పుతుందంటే షాపింగ్ లకు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు ఒక్కలల్లే వెళ్ళినా పర్లేదు. ఆసుపత్రులకు మాత్రం ఒంటరిగా వెళ్ళద్దు ఎవరైనా తోడుంటేనే బావుంటుంది అని. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన సమయంలో ఎవరైనా తోడుగా పక్కనే వుంటే ధైర్యంగా సంతృప్తిగా వుంటుందని వైద్యులతో చెప్పదలుచుకున్న విషయాలు చక్కగా చెప్పగలదని విశ్లేషకులు చెప్పుతున్నారు. జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు లేదా ఎవరో స్నేహితులు, పొరుగువారు, ఎవరన్నా తోడుంటే, వైద్యుల దగ్గర మాట్లాడుతున్నప్పుడుమద్దతుగా భద్రతగా ఫీలవ్వుతారని అధ్యాయినాలు చెప్పుతున్నాయి. నిజమే అసలే అనారోగ్యం తో వుంటే పక్కనే ధైర్య వచనాలు చెప్పే వాళ్ళు లేకపోతె ఆసుపత్రి వాతావరణంలో జబ్బు పెరిగిపోదా?

Leave a comment